ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మంచి రోజు
(Czech Republic International Badminton | India | good day | Aditya | Sayali Ghokale | Gayatri | Trupti)
చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న చెక్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్‌కు ఈ రోజు మంచి ఫలితాలు వచ్చాయి. ఈ టోర్నీ ప్రారంభ రౌండు మ్యాచ్‌లో ఆదిత్య ప్రకాశ్, తృప్తి ముర్గుండే, గాయత్రి వర్తకీ, శయాలీ గోఖలే తదితర నలుగురు భారత షట్లర్లు రాణించి ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.
ఈ టోర్నీ పురుషుల కేటగిరీలో ఆదిత్య ఒకడు మాత్రమే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. పోలెండ్ క్రీడాకారుడు మాసీజ్ కోవాలిక్ 21-8, 21-9పై ఆదిత్య గెలుపు సాధించాడు. వీరిద్దరి మధ్య మ్యాచ్ 21 నిమిషాలు పాటు జరిగింది. కాగా, ఆదిత్య తన తర్వాతి మ్యాచ్‌లో ఐదో సీడ్ స్థానిక ఫేవరేట్ జాన్ వోండ్రాతో తలపడనున్నాడు.
ఇక మహిళల విభాగంలో.. తృప్తి.. ఫ్రాన్స్‌కు చెందిన ఎలీసా చాంటర్‌పై 21-15, 21-12తో గెలుపొందింది. అలాగే ఇదే విభాగంలో గాయత్రి.. ఎనిమిదో సీడ్ నేహా పండిట్‌పై 21-18, 14-21, 21-13తో సంచలన విజయం నమోదు చేసింది. అదేవిధంగా రెండో సీడ్ శయాలీ గోఖలే.. క్రవోషియాకు చెందిన ఆండ్రియా జ్వోర్క్‌పై 21-5, 21-12తో గెలుపు సాధించింది.
తృప్తి తన తర్వాతి మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన కరీనా జోర్గెన్‌సేన్, డేన్ కామిల్లాతో గాయత్రి, ఇంగ్లండ్‌కు చెందిన ఫోంటేన్ చాప్‌మాన్‌తో శయాలీ తలపడనుంది.