ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » జపాన్, షాంఘై ఓపెన్‌ల నుంచి ఫెదరర్ ఔట్ (Tennis | Federer out | Japan Open | Shanghai Masters | website | rest | Nadal)
వచ్చే నెలలో జరిగే జపాన్ ఓపెన్, షాంఘై మాస్టర్స్ టెన్నిస్ టోర్నీల నుంచి స్విట్జర్లాండుకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ వైదొలిగాడు. తన ఫామ్‌తో పాటు తన మునుపటి ఫామ్‌ను తిరిగి దొరకబుచ్చుకునేందుకు ఫెదరర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెదరర్ తెలిపాడు.
ఫెదరర్ తన స్వంత వెబ్‌సైట్‌లో తన భవిష్యత్ ప్రణాళికల వివరాలు ఉంచాడు. తన కెంతో ఇష్టమైన నగరాలు టోక్యో, షాంఘై అని.. అక్కడ జరిగే టోర్నీలో పాల్గొనలేకపోవడం నిరుత్సాహపరిచినట్లు వివరించాడు. తన జట్టు మరియు వైద్యులను సంప్రదించిన అనంతరం ఈ రెండు టోర్నీల సమయాల్లో ఆడటం కన్నా మరికొంత విశ్రాంతి అవసరమైందని.. అందుకే తాను ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్లు వ్యాఖ్యానించాడు.
కాగా, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిళ్లు నెగ్గి తద్వారా స్పెయిన్‌కు చెందిన మాజీ నెంబర్ వన్ రఫెల్ నాదల్ నుంచి నెంబర్ వన్ స్థానాన్ని ఫెదరర్ చేజిక్కించుకున్నాడు. కానీ... ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టైటిల్‌ను ఆరోసారి నెగ్గడంలో విఫలమయ్యాడు.
ఈ టోర్నీ టైటిల్ పోరులో అర్జెంటీనాకు చెందిన జువాన్ మార్టిన్ డెల్ పోట్రో చేతిలో ఫెదరర్ కంగుతిన్నాడు. దీంతో ఫెదరర్‌కు కొంత విశ్రాంతి కావలసి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. మోకాళ్ల గాయంతో స్పెయిన్‌కు చెందిన రఫెల్ నాదల్ కూడా విశ్రాంతిలోకి వెళ్లాడు. దీంతో వచ్చే వారంలో జరిగే థాయ్‌లాండ్ ఓపెన్‌కు దూరమయ్యాడు.