వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » నెంబర్ వన్ కాపాడుకోవడానికి సఫీనా ఆరాటం (Tennis | Dinara Safina | Russia | Number One | defend | qulification | US open | Pan Pacific Open)
 
రష్యాకు చెందిన ప్రపంచ మహిళా టెన్నిస్ నెంబర్ వన్ దినారా సఫీనా తన స్థానాన్ని కాపాడుకోవడం కోసం ఆరాటపడుతోంది. వచ్చే వారం టోక్యోలో జరుగనున్న పాన్ పసిఫిక్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ నెగ్గి నెంబర్ వన్ స్థానానికి తాను అర్హురాలిగా తాను నిరూపించుకుంటానని సఫీనా వెల్లడించింది.

టోక్యోలో సఫీనా మాట్లాడుతూ, నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు తాను శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ప్రతిష్టాత్మ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మధ్యలోనే వైదొలగిన సఫీనా.. పాన్ పసిఫిక్ ఓపెన్‌లో టైటిల్ సాధించగలనని ధీమా వ్యక్తం చేసింది.

ఎవరైనా నెంబర్ వన్ స్థానాన్ని తన దగ్గర నుంచి దూరం చేస్తే.. వాళ్లను పైకి అభినందించి బాగా ఆడావని ప్రశంసిస్తాను. అయితే.. ఆ పరిస్థితి అంత సులభంగా రానివ్వనని వివరించింది. ప్రపంచ నెంబర్ వన్ స్థానంలో ఉన్న సఫీనా.. ఆ స్థానాన్ని చేరుకున్న తర్వాత వరుసగా జరిగిన నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో విఫలమైంది.

గత ఏడాదిలో తాను అత్యుత్తమ ఆటతీరును కనబరిచానని.. తెలిపింది. ఇప్పుడు కూడా అలాంటి తరహా వంద శాతం అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచేందుకు ప్రణాళిక చేస్తున్నానని వ్యాఖ్యానించింది. కాగా, పాన్ పసిఫిక్ ఓపెన్ నుంచి అమెరికాకు చెందిన ప్రపంచ నెంబర్ టూ సెరేనా విలియమ్స్ ఉపసంహరించుకుంది. మోకాలు మరియు ఇతర గాయాలతో ఆమె వైదొలగినట్లు తెలిసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.