ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » జాతీయ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్ విజేతగా భక్తి (Sports| Other Sports| National Junior Girls Chess Championship| Bhakti Kulkarni)
కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత భక్తి కులకర్ణి 24వ జాతీయ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో మరో రౌండ్ మిగిలి ఉండగానే భక్తి కులకర్ణి టైటిల్‌ను ఖరారు చేసుకుంది.
పదో రౌండ్లో మిథాలీ మధుకర్ పాటిల్‌తో భక్తి బరిలోకి దిగింది. ఇప్పటిదాకా జరిగిన పది రౌండ్లలో భక్తి మొత్తం 9.5 పాయింట్లు దక్కించుకుని, టోర్నీలో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానాన్ని ఒరిస్సాకు చెందిన పద్మని రౌత్, తమిళనాడుకు చెందిన సవితాలు పంచుకుంటున్నారు. వీరి ఖాతాలో చెరో 8 పాయింట్లున్నాయి.
బాలుర విభాగంలో పదో రౌండ్ ఫలితాల అనంతరం.. ఐ.ఎం. సేతురామన్, స్వప్నిల్ ధోపడే తొలి స్థానాన్ని పంచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లలిత్ బాబుని ఓడించి అన్వేష్ ఉపాధ్యాయ రెండో స్థానంలో నిలిచాడు.