ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » చైనా ఓపెన్: క్వాలిఫైయింగ్ తొలి రౌండ్లోనే సానియా అవుట్ (China Open, Qualifying Round, Sania Mirza out, Sports, Other Sports, Tennis)
చైనా ఓపెన్: క్వాలిఫైయింగ్ తొలి రౌండ్లోనే సానియా అవుట్
FILE
చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్ సింగిల్స్ మెయిన్ డ్రా పోటీలకు అర్హత సాధించడంలో భారత టెన్నిస్ ఆశాకిరణం సానియా మీర్జా విఫలమైంది. చైనా రాజధాని బీజింగ్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీ క్వాలిఫైయింగ్ తొలి రౌండ్లోనే సానియాకు చుక్కెదురైంది.
ఈ మ్యాచ్‌లో సానియా 3-6, 6-2, 1-6 పాయింట్ల తేడాతో స్థానిక క్రీడాకారిణి చున్ మీ జీ చేతిలో పరాజయం పాలైంది. మూడు సెట్‌లపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా ప్రత్యర్థిపై గట్టిపోటీని ప్రదర్శించలేకపోయింది. ఇకపోతే.. డబుల్స్‌లో కిర్‌స్టీ (రుమేనియా)తో జతకలిసి సానియా బరిలోకి దిగనుంది.