ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఐటీఎఫ్ టోర్నీ: జూనియర్ సింగిల్స్ విజేతగా యూకీ (Sports| Other Sports| Junior Singles| Yuki Babri| International Tennis Federation| Vishnu Vardhan)
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్ సింగిల్స్ విభాగంలో ప్రపంచ జూనియర్ నెంబర్ వన్ యూకీ బాంబ్రీ విజేతగా నిలిచాడు. ఫైనల్లో 6-4, 7-6, (7/4)తో రూపేశ్ రాయ్‌ను ఓడించాడు. మ్యాచ్ మొదటి నుంచే ప్రత్యర్థిపై యూకీ ధీటుగా రాణించి గెలుపును నమోదు చేసుకున్నాడు.
అయితే పురుషుల డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు విష్ణువర్ధన్ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. శనివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో విష్ణువర్ధన్ జోడీ ఓటమిని చవిచూసింది. దివిజ్ శరణ్‌తో కలిసి.. రోహన్ గజ్జర్-పురవ్ రాజా జోడీతో బరిలోకి దిగిన విష్ణువర్ధన్, 4-6, 5-7 పాయింట్ల తేడాతో ఓటమి పాలైయ్యాడు.