ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » బిట్‌బర్గర్ ఓపెన్: ఫైనల్లో రూపేశ్-సనావే జోడీ (Sports| Other Sports| Bitburger Open Final| Rupesh-Sanave| Badminton| Doubles)
బిట్‌బర్గర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగం ఫైనల్లోకి రూపేశ్ - సనావే థామస్ జోడీ ప్రవేశించింది. జర్మనీలో శనివారం సాయంత్రం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టాప్ సీడ్ రూపేశ్ జంట 21-16, 21-19 తేడాతో ఐదో సీడ్ జర్గెన్ కోచ్-పీటర్ జౌనెర్ (ఆస్ట్రియా)పై నెగ్గి, ఫైనల్లోకి దూసుకెళ్లింది.
37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్మాష్‌ల ద్వారా 13 పాయింట్లు, నెట్ వద్ద నాలుగు పాయింట్లు సంపాదించిన రూపేశ్-సనావేలు ప్రత్యర్థి జంటపై పైచేయిగా నిలిచారు. దీంతో మ్యాచ్ చివరికి రూపేశ్-సనావే జోడీ విజయాన్ని నమోదు చేసుకుని ఫైనల్లోకి అడుగుపెట్టింది.
ఇకపోతే.. ఆదివారం జరిగే టైటిల్ పోరులో రూపేశ్ జోడీ.. సెమీఫైనల్లో విజేతగా నిలిచే రాస్‌ముస్ బాండ్ లేదా ఆండ్రూ ఇలిస్ జంటతో బరిలోకి దిగనుంది.