ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » చైనా ఓపెన్: సఫీనా, కుజ్నెత్సొవాల ముందంజ (Dinara Safina, Svetlana Kuznetsova, China Open, Sports, Other Sports)
చైనా ఓపెన్‌లో రష్యా భామలు సఫీనా, కుజ్నెత్సొవా ముందంజలో నిలిచారు. టాప్-సీడెడ్ దినారా సఫీనా, ఆరో సీడెడ్ స్వెట్లానా కుజ్నెత్సొవాలు ఈ టోర్నీ రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు.
ఇటలీకి చెందిన రాబెర్టా విన్సితో తలపడిన సఫీనా 6-4, 6-4 పాయింట్ల తేడాతో ఓడించి రెండో రౌండ్లోకి అడుగుపెట్టింది. అలాగే చైనాకు చెందిన జెంగ్ జీని 7-6 (3), 7-5 పాయింట్ల తేడాతో స్వెట్లానా మట్టికరిపించింది.
ఇకపోతే.. రొమానియాకు చెందిన సొరానా కిరిస్టియాను 6-2, 6-2 పాయింట్ల తేడాతో వెరా జొనారెవాను ఓడించింది. అలాగే శనివారం జరిగిన మ్యాచ్‌లో వీనస్ విలియమ్స్ రష్యాకు చెందిన వెరా దుషేవినాను 6-2, 7-6 (1) పాయింట్ల తేడాతో ఓడించింది.
ఇకపోతే. చైనా ఓపెన్ పురుషుల మెయిన్ డ్రా మ్యాచ్‌లు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో ప్రపంచ నెంబర్ టూ రఫెల్ నాదల్, అమెరికా ఆండీ రాడిక్, నొవాక్ జకోవిక్‌లు బరిలోకి దిగనున్నారు.