63వ జాతీయ ఈతల పోటీలు అక్టోబర్ ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు 700 మంది స్విమ్మర్లు పాల్గొంటున్న ఈ పోటీలు, పురుషులు, మహిళలు విభాగంలో జరుగుతాయని స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వాహ కార్యదర్శి ఎస్. రాజీవ్ విలేకరులతో చెప్పారు.
ఈ జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి విజేతగా నిలిచిన ఈతగాళ్లు ఆసియన్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక చేశారు. నవంబరులో ఆసియా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగనున్నాయి.
ఇంకా ఈ జాతీయ ఈతగాళ్ల పోటీల్లో ఒలింపిక్ అవార్డు గ్రహీతలు, ఆసియా గేమ్స్‌లో అవార్డులందుకున్న స్విమ్మర్లు కూడా పాలుపంచుకుంటారని రాజీవ్ అన్నారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌ల మధ్య జరుగుతుందని ఆయన వెల్లడించారు.