వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » సైమన్‌కు థాయ్‌లాండ్ టైటిల్: ట్రొయ్‌కీకి షాక్ (Thailand Open tennis tourny | title | Simon | Troicki | Serbia | France)
 
థాయ్‌లాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగం టైటిల్‌ను ఫ్రాన్స్‌కు చెందిన గైల్స్ సైమన్ కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీ ఫైనల్లో జరిగిన మ్యాచ్‌లో సెర్బియాకు చెందిన విక్టర్ ట్రొయ్‌కీపై 7-5, 6-3తో తిరుగులేని విజయాన్ని నమోదు చేశాడు. వీరిద్దరి మధ్య మ్యాచ్ సుమారు ఒక గంట 15 నిమిషాలకు పైగా జరిగింది.

అనేక అనవసర తప్పిదాలను చేసిన ట్రొయ్‌కీ.. తన కెరీర్‌లో తొలి టైటిల్‌ను నెగ్గే అవకాశాన్ని కోల్పోయాడు. ప్రపంచ నెంబర్ 10వ ర్యాంకు ఆటగాడైన సైమన్.. మరోసారి చూడముచ్చటైన షాట్లతో.. అద్భుత ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. తొలి సెట్లో సైమన్‌పై ట్రొయ్‌కీ ఆధిపత్యం వహించినప్పటికీ.. అది ఎంతో సేపు కొనసాగలేదు.

కాగా, ఈ టైటిల్ గెలుపుతో.. సైమన్ తన కెరీర్‌లో ఆరో టైటిల్‌ను తన ఖాతాలో జమచేసుకున్నాడు. ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌లో మోకాలి గాయంతో సైమన్ ఆడలేకపోయాడు. థాయ్‌లాండ్ టైటిల్ గెలుపొందిన అనంతరం సైమన్ మాట్లాడుతూ, తాను ఎలాగైనా ఓ టైటిల్ విజయంతో
ఈ ఏడాదిని.. ముగించాలనుకున్నట్లు తెలిపాడు. ఇప్పుడు తాను అనుకున్నది సాధించగలిగానని వివరించాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.