ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » తటస్థ వేదికపై ప్రపంచ క్వాలిఫైయర్ మ్యాచ్ (World Football qualifier match | neutral venue | Guinea | West Africa | Burkina Faso | Accra)
గినియాలో గత కొంతకాలంగా కొనసాగుతున్న నిరసనలు మరింతగా పెరగడంతో.. ప్రపంచ కప్ ఫుట్‌బాల్ క్వాలిఫైయర్ మ్యాచ్‌ను తటస్థవేదికపై నిర్వహించాలని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) నిర్ణయించింది. పశ్చిమ ఆఫ్రికా, బర్కినా ఫాసోల మధ్య జరిగే ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ను గినియాలో కాకుండా.. తటస్థవేదికపై నిర్వహించనున్నట్లు ఫిఫా నిర్ధారించింది.
ఆఫ్రికా జోన్ గ్రూప్ ఫైవ్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లను అక్టోబర్ 11న ఘనాలోని అక్రాలో నిర్వహించనున్నారు. నిరసన కారులపై గినియా సైనికుల కాల్పులు జరపడంతో... గత వారంలో సుమారు 150 మందికి పైగా ప్రజలు మృతి చెందినట్లు అక్కడి మానవ హక్కుల సంస్థలు వెల్లడించాయి.
ఈ కారణంతో.. ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లను తటస్థవేదికలపై నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు.. గినియాలో వెలువెత్తుతున్న నిరసనల్లో సుమారు.. 50వేల మందికి పైగా పాల్గొన్నారని.. అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే ఇప్పటికే.. వేర్వేరు సంఘటనల్లో 57 మంది మృతి చెందినట్లు తెలిపాయి.