ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఇక జాతీయ క్రీడలను ఉచితంగా వీక్షించవచ్చు (National Games | free of cost | Jharkhand | Viewers | JOA | Mahdukant Pathak)
జార్ఖండ్‌లో నవంబర్ 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న జాతీయ క్రీడలను ఎలాంటి చెల్లింపులు లేకుండా.. క్రీడా ప్రేమికులు వీక్షించవచ్చు. ఈ విషయాన్ని జార్ఖండ్ ఒలింపిక్ అసోసియేషన్ (జేఓఏ) ప్రతినిధి మధుకంట్ పథక్ వెల్లడించారు. అంతకుముందు ఈ క్రీడలకు రూ. 10 ఛార్జ్ వసూలు చేయాలనుకున్నారు.
అయితే.. మళ్లీ దాన్ని ఉపసంహరించుకున్నట్లు మధకంట్ తెలిపారు. ఈ క్రీడలను చూడటానికి వచ్చే వీక్షకులు.. క్రీడ ప్రారంభోత్సవ, ముగింపు కార్యక్రమాలకు మాత్రమే టికెట్లను కొనుగోలు చేయవలసి ఉంటుందన్నారు. రూ. 500, రూ. 200 వద్ద ఈ టికెట్ ధర ఉన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాలను మినహాయిస్తే.. వేదికల్లో జరిగే క్రీడలను ఉచితంగా వీక్షించవచ్చని వ్యాఖ్యానించారు.
జార్ఖండ్ రాజధానిలో నవంబర్ 21న జాతీయ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమం.. డిసెంబర్ 5వ తేదీన ముగింపు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ జాతీయ క్రీడల సందర్భంగా మొత్తం 24 ఈవెంట్‌లలో పోటీలుంటాయని మధుకంట్ తెలిపారు. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చే క్రీడాకారుల కోసం భారీగా విడిది ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.