వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » సాయ్ 'స్పోర్ట్స్ హాస్టల్‌'ను ప్రారంభించనున్న గిల్ (SAI | Sports hostel | Bhopal | MS Gill | Central Zone | R K Naidu)
 
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు చెందిన క్రీడాకారుల వసతి గృహాల (హాస్టల్)ను కేంద్ర క్రీడలు మరియు యువ సంబంధ శాఖ మంత్రి ఎం ఎస్ గిల్ ప్రారంభించనున్నారు. భోపాల్ రాజధానిలోని బిషన్‌ఖేడీ సమీపాన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన స్థానిక కేంద్రం (సెంట్రల్ జోన్) వద్ద ఈ హాసల్‌ను నిర్మించారు.

భోపాల్‌లో సాయ్ రీజినల్ సెంటర్ డైరెక్టర్ ఆర్ కే నాయుడు మాట్లాడుతూ, ఈ రోజు ఉదయం గిల్ ఇక్కడకు చేరుకున్నారన్నారు. టైప్ త్రీ కేటగిరీ శిక్షణ తీసుకునే క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాలను గిల్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. గిల్‌తో పాటు మధ్యప్రదే్శ్ క్రీడా మంత్రి తుకాజీరావ్ పౌర్, సాయ్ డైరెక్టర్ జనరల్ సయన్ ఛటర్జీ‌లు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని వివరించారు.

ఈ రోజు రాత్రి భోపాల్‌లో బస చేసిన తర్వాత నేడు తిరిగి గిల్ ఢిల్లీ వెళతారని తెలిపారు. కాగా, ఈ రీజినల్ కేంద్రం 2001, జూన్‌లో ప్రారంభించారు. దేశంలో అత్యుత్తమ క్రీడా కేంద్రాల్లో ఒకటిగా ఇది నిలిచిందని వ్యాఖ్యానించారు. క్రీడాకారులకు అత్యాధునిక సౌకర్యాలను ఈ కేంద్ర కల్పిస్తున్నట్లు తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.