ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » నేషనల్ స్నూకర్ ఛాంపియన్‌షిప్ విజేతగా పంకజ్ (National Snooker championship | Title | Pankaj Advani | Meenal Thakur)
నిన్న రాత్రి ఆగ్రాలో జరిగిన నేషనల్ స్నూకర్స్ ఛాంపియన్‌షిప్ టోర్నీ టైటిల్‌ను పంకజ్ అద్వానీ.. కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీ ఫైనల్లో సౌరభ్ కొఠారీపై పంకజ్ అద్వానీ తిరుగులేని విజయం నమోదు చేశాడు. దీంతో వరల్డ్ ప్రొఫెషనల్ బిలియర్డ్స్ ఛాంపియన్ అయిన అద్వానీ.. ఇటీవలే 76వ జాతీయ బిలియర్డ్స్ సీనియర్ టైటిల్‌ను సైతం గెలుచుకున్నాడు.
అంతకుముందు మహిళల విభాగంలో మహారాష్ట్రకు చెందిన మీనాల్ థాకూర్.. జాతీయ స్నూకర్ టైటిల్‌ను గెలుచుకుంది. నిజానికి.. మహిళ, పురుషుల విభాగాల్లో టైటిల్ గెలుచుకున్న ఈ ఇద్దరు.. తుది పోరులో డబుల్ స్కోరును సాధించి అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ టోర్నీ ఫైనల్లో మీనాల్.. తమినాడు చెందిన విద్యా పిళ్లైపై 75-42, 32-68, 56-50, 70-37తో గెలుపొందింది. కాగా, ఈ టోర్నీ.. భారత బిలియర్డ్స్ మరియు స్నూకర్ సమాఖ్య సమర్పణలో.. యూపీ బిలియర్డ్స్ మరియు స్నూకర్ అసోసియేషన్‌చే నిర్వహించబడింది.