ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఒలింపిక్స్ హక్కులు: హిరోషిమా, నాగసాకి ఆశాభావం (2020 Olympics host rights | Hiroshima | Nagasaki | Tokyo | bid | America | Obama | Noble prize)
అణుబాంబు దాడికి గురై అష్టకష్టాలు పడిన జపాన్‌లోని హిరోషిమా, నాగసాకీలు 2010 ఒలింపిక్స్‌కు ఆతిథ్యంపై ఆశాభావంతో ఉన్నాయి. ఒలింపిక్స్ క్రీడల ఆతిథ్య హక్కుల కోసం నిర్వహించనున్న బిడ్‌లో ఈ రెండు ప్రాంతాలు సంయుక్తంగా పాల్గొననున్నాయి.
2016 ఒలింపిక్స్ కోసం నిర్వహించిన ఒలింపిక్ బిడ్‌లో టోక్యో విఫలం, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నోబల్ శాంతి బహుమతిని గెలుచుకున్న తర్వాత హిరోషిమా, నాగసాకిల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. మెరుగైన భవిషత్తుపై ఆశాభావం మరియు అణ్వాయుధాలు నియంత్రణ కోసం చర్యలు వంటి అంశాలపై ఒబామా ప్రపంచానికి సందేశాన్నిచ్చారు.
ఈ నేపథ్యంలో అణ్వాయుధాల నివారణలో భాగంగా.. ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించాలని హిరోషిమా, నాగసాకిలు ఈ ఒప్పందం చేసుకున్నాయి. శాంతి కోసం మేయర్లు ప్రపంచవ్యాప్తంగా 3వేల నగరాల్లో అణ్వాయుధాల నివారణకు కృషి చేస్తున్నాయని హిరోషిమా నగర క్రీడల అధికారి కొజి ఉత్సుమోనియా తెలిపారు.
2020 నాటికి శాంతి ప్రక్రియలో విజయం సాధించగలమని వివరించారు. 2020 ఒలింపిక్స్ క్రీడల ఇక్కడ నిర్వహించినట్లయితే అది అత్యంత గొప్ప విషయంగా అభివర్ణయించారు. శాంతి దినోత్సవాలను కూడా అప్పుడే జరుపుతామన్నారు.