ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » రోనిత్, శర్మదాల ఖాతాలో డబుల్ ధమాకా! (Sports| Other Sports| Ronit Bisht| Singles| Doubles| National Tennis Tournament)
ఎఐటీఏ అండర్-18 జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో రోనిత్- శర్మదా బాలు ఓ మెరుపు మెరిశారు. లూధియానాలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఢిల్లీకి చెందిన రోనిత్ మరియు కర్ణాటకకు చెందిన శర్మదాలు, సింగిల్స్, డబుల్స్ టైటిల్స్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. అండర్-18 గ్రూప్‌లో సింగిల్స్, డబుల్స్ టైటిళ్లను సొంతం చేసుకున్న వీరిద్దరూ.. ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థులపై ధీటుగా రాణించారు.
సింగిల్స్ ఫైనల్లో రెండో సీడెడ్ రోనిత్.. టాప్ సీడ్ మొహిత్ మయూర్‌పై (తమిళనాడు) మెరుగైన ఆటతీరును ప్రదర్శించాడు. హోరాహోరీగా సాగిన ఈ టైటిల్ పోరులో 6-7(1), 6-2, 6-2 పాయింట్ల తేడాతో నెగ్గాడు. అలాగే డబుల్స్ ఫైనల్లో కర్ణాటకకు చెందిన వినోద్ గౌడతో బరిలోకి దిగిన రోనిత్.. ఢిల్లీ-తమిళనాడు ద్వయం రోహిత్ బిష్ట్-మొహిత్ మయూర్ జయప్రకాష్‌లను 6-3, 4-6, 10-5 పాయింట్ల తేడాతో మట్టికరిపించాడు.
ఇకపోతే.. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ శర్మదా బాలు (కర్ణాటక) 7-5, 7-6 (8) పాయింట్ల తేడాతో ప్రార్థనా తొంబారే (మహారాష్ట్ర)ను వరుస సెట్లలో ఓడించింది. అలాగే డబుల్స్ విభాగంలో ఢిల్లీకి చెంది శ్వేత రానాతో జతకట్టిన శర్మదా బాలు.. తీర్థఇస్కా (ఆంధ్రప్రదేశ్)- ప్రార్థన తొంబారే (మహారాష్ట్ర) జోడీపై 6-0, 7-5 తేడాతో గెలుపొందింది.