వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » షాంఘై టోర్నీ: నాదల్‌కు డేవిడెంకో షాక్ (Shanghai Masters tennis tourny | Rafael Nadal | Nikolay Davydenko)
Feedback Print Bookmark and Share
 
గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన నాదల్.. తన పూర్వపు వైభవాన్ని అందుకోవడంలో మరోసారి విఫలమయ్యాడు. షాంఘై ఓపెన్ మాస్టర్స్ ఛాంపియన్ టెన్నిస్ టోర్నీ టైటిల్ పోరులో టాప్ సీడ్ ప్రపంచ నెంబర్ టూ రఫెల్ నాదల్‌కు స్ఫూర్తి వంతమైన ఆటతో నికోలే డేవిడెంకో షాక్ ఇచ్చాడు.

ఈ టోర్నీ అంతిమ పోరులో.. జరిగిన మ్యాచ్‌లో నాదల్‌పై 7-6, 6-3 డేవిడెంకో గెలుపొంది.. టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నీలో ఆరోసీడ్‌గా బరిలోకి దిగిన డేవిడెంకో.. నాదల్‌తో రెండు గంటలకు పైగా పోరాడాడు. తొలి సెట్లోనే 7-3తో నాదల్‌పై డేవిడెంకో ఆధిపత్యం వహించాడు.

రెండో సెట్లో లభించిన బ్రేక్ పాయింట్‌తో ఈ ఏడాదిలో నాలుగో టైటిల్‌ను తన ఖాతాలో జమచేసుకున్నాడు. ఈ ఏడాది మేలో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ సమయంలో నాదల్ గాయం పాలయ్యాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.