ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » కెనడాపై భారత్ గెలుపు: 4-0తో సిరీస్‌లో ఆధిపత్యం (Hockey news | India | Canada | Hockey | Sandeep Singh | Gurwinder Chandi | David Jameson)
టమనావిస్ పార్క్‌లో జరుగుతున్న ఏడు హాకీ మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తాజాగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో 3-1తకో కెనడాపై భారత్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ సిరీస్‌లో కెనడాపై 4-0తో సందీప్ సింగ్ సారథ్యంలోని భారత్ లీడింగ్‌లో ఉంది.
ఈ మ్యాచ్‌లో 29వ నిమిషంలో.. గుర్విందర్ ఛండీ రూపంలో భారత్ స్కోరు ఖాతాను ప్రారంభించింది. ఆ తర్వాత.. కెప్టెన్ సందీప్.. 35వ నిమిషంలో.. 67వ నిమిషంలో.. అద్భుత గోల్స్ సాధించాడు. ఆ మధ్యలో కెనడా ఆటగాడు డేవిడ్ జేమ్సన్.. 41వ నిమిషంలో స్కోరు సాధించాడు.
వాస్తవానికి కెనడా.. అద్భుత శుభారంభం చేసింది. ఓ ఫెనాల్టీ కార్నర్‌ను గెలుపొందింది. అయితే భారత్ మాత్రం రక్షణాత్మక ఆటతీరుతో ప్రారంభం చేసింది. ఈ తరుణంలో కొన్ని అనవసర తప్పిదాలను కూడా చేసింది. కానీ సందీప్ చాకచక్యం.. సమిష్టి కృషి వెరసి భారత జట్టుకు నాలుగో మ్యాచ్ విజయం తథ్యం అయింది.