సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో మేలైన క్రీడా మౌళికసదుపాయాలను అందించండపై కేంద్రం దృష్టి సారించింది. అన్ని రకాల క్రీడల ఈ ప్రాంతాల్లో ప్రమోట్ చేసేందు కోసం కేంద్రం చూస్తున్నట్లు కేంద్ర క్రీడా మరియు యువ సంబంధ శాఖ కార్యదర్శి పీపీ బాబు పాటిల్ వెల్లడించారు.
మదికేరీలో సింథటిక్ ట్రాక్‌తో తయారైన హాకీ స్టేడియం మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన బాలికల హాస్టల్ భవంతిని ప్రారంభించేందుకు వచ్చిన సందర్భంగా బాబు పాటిల్ మీడియాతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా నైపుణ్యం కలిగిన వారిని అంతర్జాతీయ విఫణిలోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం చూస్తున్నట్లు తెలిపారు.
వచ్చే ఏడాది న్యూఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరుగనున్నాయి. ఇందులో పాల్గొనే క్రీడాకారులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పించినట్లు తెలిపారు. ఇలాంటి ప్రతిష్టాత్మక క్రీడా టోర్నీల ఆతిథ్యానికి క్షేమదాయకమైన ప్రదేశంగా భారత్‌ను ప్రపంచం ముందు ఉంచాలని కేంద్రప్రభుత్వం ఆ దిశగా కృషి చేస్తోంది. అందుకే కామన్వెల్త్ క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించింది.