వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఐపీఎల్ తరహాలో ఫుట్‌బాల్ టోర్నీలు: ప్రఫుల్ (Football | IPL | tournies | Praful Patel | AIFF president | Dasmunshi)
Feedback Print Bookmark and Share
 
ఐపీఎల్ తరహాలో ఫుట్‌బాల్ టోర్నీలు నిర్వహిస్తే.. బావుంటుందని భారత ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. అయితే చెప్పడం తేలికే కానీ.. దీనిని ఆచరణలో పెట్టడం కష్టసాధ్యమేనన్నారు. అయినప్పటికీ.. ఈ కొత్త తరహా ఆలోచనతో ఇందుకు తగిన ప్రణాళికలు చేసి భారత ఫుట్‌బాల్‌లో సరికొత్త ఒరవడిని తీసుకురావాలని చూస్తున్నట్లు వ్యాఖ్యానించారు.

పౌర విమానయాన శాఖ మంత్రి అయిన ప్రఫుల్.. ఏఐఎఫ్ఎఫ్ వార్షిక సమావేశంలో.. భారత ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఈ పదవిలో బాధ్యతలు నిర్వర్తించిన దాస్‌మున్షీకి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రఫుల్‌ను ఆ స్థానానికి ఎంపిక చేయడం జరిగింది.

ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ప్రఫుల్ మాట్లాడుతూ, భారత్‌లో ఫుట్‌బాల్ వృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. క్రికెట్‌లో ఐపీఎల్‌లో లాగా ఈ షార్ట్ ఫార్మాట్‌లు ఫుట్‌బాల్‌లో ప్రవేశపెట్టడం బాగానే ఉంటుంది. కానీ రొనాల్డ్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను తీసుకురావడం కష్టమన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.