వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » పీఎస్‌పీబీ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌గా సైనా (PSPB | Saina Nehwal | Sports person of the year | New Delhi | Pankaj Advani | Veerendra Sehwag)
Feedback Print Bookmark and Share
 
భారత మహిళా ప్రధాన షట్లర్ సైనా నెహ్వాల్.. 2008-09 స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌ అవార్డుకు ఎంపికైంది. అలాగే ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ పంకజ్ అద్వానీ, భారత క్రికెట్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లు 2007-08కు ఈ గౌరవ పురస్కారాన్ని అందుకోనున్నారు.

న్యూఢిల్లీలో జరిగిన తొమ్మిదో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ (పీఎస్‌పీబీ) వార్షిక అవార్డుల కార్యక్రమం సందర్భంగా ఈ అవార్డులను అందజేయడం జరిగింది. అయితే వివిధ కారణాలతో.. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి కొందరు అవార్డు గ్రహీతలు హాజరుకాలేక పోయారు.

ఏదేమైనప్పటికీ.. అద్వానీ, చెస్ దిగ్గజం అభిజిత్ గుప్తా, బ్యాడ్మింటన్ ఆటగాళ్లు శృతి కురియన్, తృప్తి ముర్గుండే, భారత టేబుల్ టెన్నిస్ ఆటగాడు... సుభాజిత్ సాహాలు మాత్రం ఈ అవార్డుల కార్యక్రమానికి వచ్చారు. కాగా, మాజీ భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మోనాలిసా మెహతాను 2007-08 లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు. అలాగే2008-09కు మాజీ హాకీ గోల్‌కీపర్ రోమియో జేమ్స్ ఎంపికయ్యారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.