కెనడాలో భారత హాకీ జట్టు వరుస విజయాలతో సత్తా చాటుతోంది. టమానవిస్ పార్క్‌లో జరుగుతున్న ఏడు మ్యాచ్‌ల హాకీ టెస్ట్ సిరీస్‌లో కెనడాపై మరో విజయాన్ని నమోదు చేసిన ఈ టోర్నీలో 5-0తో భారత్ లీడింగ్‌లోకి వచ్చింది. శివేంద్ర సింగ్ వరుసగా భారత్‌కు స్కోరు సాధించడంతో ఆరో మ్యాచ్‌లో కెనడాపై 3-1తో భారత్ గెలుపొందింది.
20వ నిమిషంలో, 65వ నిమిషంలో శివేంద్ర గోల్స్ సాధించగా.. ఈ మధ్యలో 54వ నిమిషంలో.. శర్వణ్‌జిత్ సింగ్.. స్కోరు సాధించి భారత విజయానికి మార్గం సుగమం చేశాడు. ఒక మ్యాచ్‌ను డ్రాగా ముగించి మిగిలిన అన్ని మ్యాచ్‌లలో కెనడాపై భారత్ గెలిచింది. ఈ టూర్‌లో ఇక ఏడు మరియు చివరి టెస్ట్ ఆడాల్సి ఉంది.
ప్రారంభ సెషన్‌లో భారత ఆటగాళ్లను రెండు కన్నా ఎక్కువ పెనాల్టీ కార్నర్‌లు వచ్చినా.. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. చివరి వరకు మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగింది. స్కోరు విషయంలో భారత్‌కు అత్యంత సమీపంలోనే కెనడా వచ్చింది. అయితే మ్యాచ్ చివరలో శివేంద్ర ప్రదర్శనతో కెనడా వెనుకబడింది.