ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » పదిమంది హంపిలను తయారు చేస్తాం: చెస్ సమాఖ్య (Chess player | Koneru Humpy | Asian Indoor Games | Vietnam | AICF)
వియత్నాంలో జరుగబోయే చెస్ గేమ్స్‌లో తాను పాల్గొనబోవడం లేదని కోనేరు హంపి ప్రకటించడంపై చెస్ సమాఖ్య మండిపడుతోంది. అక్టోబరు 30 నుంచి నవంబరు 6 వరకూ జరుగనున్న ఆసియా ఇండోర్ చెస్ గేమ్స్‌లో కోనేరు హంపి పాల్గొనబోవడం లేదని ఆమె తండ్రి కోనేరు అశోక్ వెల్లడించారు.
ఈ సందర్భంగా హంపి మాట్లాడుతూ... అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేముందు దానికి తగిన శిక్షణ అవసరమనీ, అయితే ప్రస్తుతం తను ఒత్తిడికి లోనై ఉన్నందువల్ల ఆటలో పాల్గొనలేకపోతున్నానని చెప్పింది.
ఇవన్నీ ప్రక్కనపెడితే చెస్ సమాఖ్య నుంచి తనకు సహకారం లేదని హంపి విమర్శించింది. దీనిపై సమాఖ్య మండిపడింది. అసలు హంపి ఏ సమయంలోనూ ఆటపై శ్రద్ధ పెట్టలేదనీ, వ్యక్తిగత కారణాలు చూపుతూ అంతర్జాతీయ స్థాయి ఆటలకు గైర్హాజరవుతూ వస్తోందని విరుచుక పడింది.
భవిష్యత్తులో హంపిలాంటి వారిని పదిమందిని తయారు చేసి భారతదేశ చెస్ క్రీడాకారుల సత్తా ఏమిటో చూపిస్తామని ధీమా వ్యక్తం చేసింది.