వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » వాంకోవర్ 2010 ఒలింపిక్స్ చైర్మన్ పూలే మృతి (Jack Poole | Chairman of 2010 Vancouver Olympics | British Columbia)
Feedback Print Bookmark and Share
 
వాంకోవర్ వింటర్ 2010 ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు జాక్ పూలే మృతి చెందారు. ఆయన 76 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని.. నిన్న ఆసుపత్రిలో మృతి చెందిన వాంకోవర్ ఒలింపిక్ అధికారులు వెల్లడించారు.

బ్రిటిష్ కొలంబియాకు ఒలింపిక్స్ క్రీడలను తెచ్చేందుకు దశాబ్దానికి పైగా జాక్ పూలే ఎనలేని కృషి జరిపారు. ఒలింపిక్స్ కోసం చేసిన బిడ్‌లో వాంకోవర్‌కు నేతృత్వం వహించారు. ఆయన నిర్వాహక కమిటీ అధ్యక్షుడే కాకుండా.. వాంకోవర్ ఒలింపిక్ నిర్వాహక కమటి బోర్డు డైరెక్టర్ల ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

వాంకోవర్ నిర్వాహక కమిటీ సీఈఓ జాన్ ఫర్లాంగ్ మాట్లాడుతూ, క్రీడ ప్రపంచానికి ఇది అశుభవార్తగా పేర్కొన్నారు. ఒలింపిక్స్ క్రీడలను వాంకోవర్‌కు తీసుకురావడంలో అత్యంత కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. బ్రిటిష్ కొలంబియాలో టాప్ రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా అందరికీ సుపరిచితులు. 2006లో దేశంలోనే అత్యున్నత పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ కెనడా' గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.