వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్‌లోకి మాల్యా ఎంపిక (Vijay Mallya | World Motor Sports Council | FIA | Force India)
Feedback Print Bookmark and Share
 
భారత మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న ఫోర్స్ ఇండియా ఛైర్మన్ విజయ్ మాల్యా.. ప్రతిష్టాత్మక ఎఫ్ఐఏ వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్‌కు ఎంపికయ్యారు. ప్రముఖ ప్రైవేటు విమానయాన మరియు మద్యం కంపెనీ యజమాని అయిన మాల్యా.. ఈ కౌన్సిల్‌లో అభ్యర్థిత్వం కోసం పోటీ చేసిన 41 మందిలో ఒకరు.

పారిస్‌లో నిన్న జరిగిన పోల్ తర్వాత నాలుగు సంవత్సరాల పాటు కౌన్సిల్ అభ్యర్థిగా కొనసాగేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. బ్యాలెట్ పేపరులో ఒక్కో అభ్యర్థి పేరును పేర్కొనడం జరిగింది. ఫలితాలను కూడా ఈ బ్యాలెట్ పేపరు వెనుకే ఇచ్చారు. ఫలితం వెలువడిన అనంతరం ఏ దేశ ప్రతినిధి ఎంపికయ్యారో ప్రదర్శించారు.

ఈ ప్రదర్శనలో మాల్యాకు పట్టం కట్టారు. కాగా, ఫోర్స్ ఇండియా ఛైర్మన్ అయిన మాల్యా ఫార్ములా వన్ రేసింగ్‌ను భారత్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఎఫ్ఐఏ కౌన్సిల్‌కు ఆయన ఎంపికవడం విశేషం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.