ప్రపంచ జూనియర్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చుక్కెదురైంది. "వై" గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 2-3 తేడాతో చైనీస్ తైపీ చేతిలో పరాజయం పాలైంది. శనివారం జరిగిన బాలికల సింగిల్స్‌లో సిక్కి రెడ్డి, డబుల్స్‌లో సిక్కి-తులసి జోడీ ఓటమిని చవిచూడటం భారత్ విజయావకాశాలను దెబ్బతీసింది.
తొలుత జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో ప్రాజక్తా సావంత్ ప్రణవ్ చోప్రా జోడీ 17-21, 21-15, 19-21తో సు జెన్ హావోపై గెలిచి 1-1తో స్కోరును సమం చేశాడు. బాలికల సింగిల్స్‌లో యూ పో 21-16, 21-18తో సిక్కిరెడ్డిని ఓడించిన తైపీకి 2-1 ఆధిక్యం లభించింది.
బాలుర డబుల్స్ మ్యాచ్‌లో సాయి ప్రణీత్-ప్రణవ్ చోప్రా 21-11. 21-19తో చాంగ్ కాయ్ లియాంగ్-హంగ్ యింగ్ యువాన్‌లపై గెలిచి స్కోరును సమం చేశారు. ఇకపోతే... ఆదివారం జరిగే మ్యాచ్‌లో భారత్.. జపాన్‌తో బరిలోకి దిగనుంది.