జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ రిలే విభాగంలో ఆంధ్రప్రదేశ్ తన హవాను కొనసాగించింది. 4/100లో మహిళల జట్టు స్వర్ణం సాధించగా, పురుషుల బృందం కాంస్యం నెగ్గింది. అలాగే 4/400లో మహిళల జట్టు రజతం గెలిచింది.
శనివారం జరిగిన రిలే పోటీల్లో రెండు పతకాలు గెలిచిన సౌజన్య 400 మీటర్ల విభాగంలో టాప్-5స్థానంతో ఆసియా ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది.
ఈ పోటీలు నవంబర్ 10-14 వరకు చైనాలో జరుగుతాయి. ఆఖరి రోజు పోటీల్లో సత్తి గీత, సుధ, సౌజన్య, జ్యోతిల బృందం 46.39 సెకన్లతో 4100 రిలేలో పసిడి పతకాన్ని నెగ్గింది. పురుషుల విబాగంలో ఆంజనేయులు, కృష్ణమోహన్, శ్రీనివాస్, ప్రసాద్‌ల జట్టు 42.40 సెకన్లతో కాంస్య పతకం గెలుపొందింది.