ప్రపంచ జూనియర్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఓటమి పాలైంది. ఆదివారం జపాన్‌తో జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 1-3తేడాతో పరాజయం పాలైంది. ఈ పోటీలో భారత తరపున బాలుర సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సుమీత్ రెడ్డి మాత్రమే గెలుపును నమోదు చేసుకున్నాడు.
వతనాబీ తాత్సుయాతో జరిగిన మ్యాచ్‌లో సుమీత్ 22-20, 17-21, 21-18తో విజయం సాధించి భారత్‌కప 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే బాలికల సింగిల్స్‌లో తులసి 16-21, 17-21తో మితాని మినాత్సు చేతిలో పరాజయం పొందడంతో స్కోరు సమమైంది. సోమవారం 7-8 స్థానాల కోసం జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో హాంకాంగ్‌తో భారత్ తలపడనుంది.