కెనడా ఏడు టెస్టుల హాకీ సిరీస్‌లో భారత్ తన హవాను కొనసాగించింది. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌నుంచి ఒక్క ఓటమిని కూడా నమోదు చేసుకోని భారత్, చివరి టెస్టులోనూ గెలుపొందింది. దీంతో 6-0 తేడాతో భారత్ సిరీస్‌ను సొంతం చేసుకుంది.
కెనడా-భారత్‌ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్.. కెనడాను ధీటుగా ఎదుర్కొని 3-2 గోల్స్ తేడాతో మట్టికరిపించింది. భారత్ నుంచి ప్రబ్‌జ్యోత్ సింగ్ (21 నిమిషం), గుర్విందర్ చండి (31వ), తుషార్ ఖండ్కర్ (49వ) గోల్స్ సాధించగా, ఆతిథ్య జట్టు కెనడా నుంచి ఫెర్నాండెజ్ (26, 46 నిమిషాల్లో) రెండు గోల్స్ చేశాడు.
ఆట 21వ నిమిషంలో భారత్ ఖాతా తెరిచింది. మిడ్ ఫీల్డర్ సర్దార్ సింగ్ అందించి చక్కటి పాస్‌ను ప్రభ్‌జ్యోత్ గోల్‌గా మలచడంతో భారత్ 1-0తో ముందంజలో నిలిచింది.
ఇలా భారత్ గోల్స్‌ను అడ్డుకునే దిశగా కెనడా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో భారత్ 3-2 పాయింట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుని కెనడా పర్యటనను దిగ్విజయం పూర్తిచేసుకుంది.