వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » జాతీయ సీనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం (Hyderabad | National Senior Boxing Championship | Star Boxers | Vijender | Akhil Kumar | Jitendar |)
Feedback Print Bookmark and Share
 
Boxing Gloves
FILE
రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాదులో సోమవారం సాయంత్రం జాతీయ సీనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. స్టార్ బాక్సర్లు విజేందర్, అఖిల్ కుమార్, జితేందర్‌ల గైర్హాజరీతో ప్రారంభమైన ఈ పోటీలలో తొలిరోజు ఎలాంటి సంచలనాలూ నమోదు కాలేదు.

నగరంలోని సరూర్ నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన ఈ పోటీలలో డిపెండింగ్ ప్రపంచ యూత్ ఛాంపియన్ నానో సింగ్ (ఫ్లయ్ వెయిట్-సర్వీసెస్) శుభారంభం చేశాడు. 48 కేజీల విభాగంలో తొలి రౌండులో నానో సింగ్ 18-2 స్కోరుతో ఆదిత్య (పశ్చిమ బెంగాల్)పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. అలాగే 51 కేజీల విభాగంలో సురంజయ్ సింగ్ 11-4 స్కోరుతో సంజయ్ సింగ్ (రైల్వేస్)పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.

ఇదిలా ఉంటే.. మణిపూర్‌కు చెందిన నానో, సంజయ్ సింగ్‌లు ఇద్దరిలో నానో తొలి రౌండ్ నుంచి "పంచ్"ల వర్షం కురిపించి ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చాడు. అయితే సంజయ్ మాత్రం తొలి రౌండ్‌లోనే తడబడ్డప్పటికీ.. రెండో రౌండ్ నుంచి పుంజుకుని విజయం సాధించాడు.

కాగా.. తొలిరోజు కేవలం రెండు విభాగాల్లో మాత్రమే బౌట్‌లను నిర్వహించారు. రెండో రోజు పోటీలు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.