ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » వచ్చే ఏడాది జనవరి 4 నుంచి చెన్నై ఓపెన్ (Chennai Open | Tennis | January | French Open | Runner Up | Robin Soderling | M.A. Alagappan)
ప్రతిష్టాత్మక చెన్నై ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి నాలుగో తేదీ నుంచి ఈ టోర్నీ లాంఛనంగా ప్రారంభం కానుంది. జనవరి పదో తేదీ వరకు కొనసాగే ఈ టోర్నీలో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ ఆటగాడు రాబిన్ సదర్లింగ్ పాలుపంచుకుంటున్నట్లు ప్రకటించాడు. భారత్‌లో జరిగే ఈ ఏటీపీ ప్రపంచ టెన్నిస్ టోర్నమెంట్లో ఇంకా మరిన్ సిలిక్ కూడా హాజరవుతాడు.
ఈ విషయమై సదర్లింగ్ మాట్లాడుతూ.. చెన్నై ఓపెన్‌లో ఆడటం హ్యాపీగా ఉందన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఈ టెన్నిస్ టోర్నమెంట్లో మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు.
ప్రతిష్టాత్మక చెన్నై ఓపెన్‌ను టెన్నిస్ అభిమానుల అంచనాలకు అనుగుణంగా నిర్వహిస్తామని తమిళనాడు టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఎ. అలగప్పన్ చెప్పారు. టాప్ ర్యాంకర్ టెన్నిస్ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాలుపంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ టోర్నీకి ఎయిర్‌సెల్ ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు.