ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్: మళ్లీ టాప్‌లో నిలిచిన సఫీనా (Sports| Dinara Safina| Tennis Ranking| Doha| WTA world rankings| Serena Williams)
డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్: మళ్లీ టాప్‌లో నిలిచిన సఫీనా
FILE
తాజాగా విడుదలైన డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో రష్యన్ టెన్నిస్ స్టార్ దినారా సఫీనా మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
సోమవారం విడుదల చేసిన టెన్నిస్ ర్యాంకింగ్స్ జాబితాలో అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరీనా విలియమ్స్‌ను సఫీనా వెనక్కు నెట్టి టాప్‌లో నిలిచింది. దోహాలో జరిగిన టెన్నిస్ టోర్నీలో గట్టిపోటీని ప్రదర్శించినందుకుగాను సఫీనా టాప్ ర్యాంకర్‌గా తన హవాను కొనసాగిస్తోంది.
ఏప్రిల్‌లో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచిన సఫీనాను.. ఆ సీజన్లో బీజింగ్‌లో జరిగిన టోర్నీల్లో సెరీనా విలియమ్స్ గట్టిపోటీని ప్రదర్శించి వెనక్కి నెట్టింది. తాజా ర్యాంకింగ్స్‌లో సఫీనా, సెరీనా విలియమ్స్ 155 పాయింట్ల తేడాతో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఇప్పటివరకు అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి 11 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సొంతం చేసుకోగా, దినారా సఫీనా కేవలం ఒక్క గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గకుండా అగ్రస్థానంలో కొనసాగడం విశేషం. ఇంకా డెన్మార్క్‌కు చెందిన యూఎస్ ఓపెన్ ఫైనలిస్ట్ కరోలిన్ వాజ్నియాకి తన కెరీర్‌లో తొలిసారిగా నాలుగో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.