ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » రిటైర్మెంట్ ప్రకటించే ప్రసక్తేలేదు: విలియమ్స్ సిస్టర్స్ (Venus Williams| Serena Williams| Tennis| Retirement| Australian Open| Wimbledon)
రిటైర్మెంట్ ప్రకటించే ప్రసక్తేలేదు: విలియమ్స్ సిస్టర్స్
FILE
అమెరికా టెన్నిస్ దిగ్గజాలు, సోదరీమణులు వీనస్ విలియమ్స్ మరియు సెరీనా విలియమ్స్‌లు ఇప్పట్లో టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించే ప్రసక్తే లేదంటున్నారు. టెన్నిస్ అభిమానులను తమ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న ఈ టెన్నిస్ స్టార్లు ఇప్పుడిప్పుడే టెన్నిస్ కోర్టుకు గుడ్‌బై చెప్పమని స్పష్టం చేశారు.
ఇప్పటికే 7 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను వీనస్ విలియమ్స్ తన ఖాతాలో వేసుకోగా, సెరీనా 11 గ్రాండ్ స్లామ్‌లను గెల్చుకుంది. ఈ నేపథ్యంలో తమ కాంబినేషన్‌లో ఇంకా టెన్నిస్ కోర్టులో అభిమానులను అలరిస్తామని విలియమ్స్ సిస్టర్స్ అంటున్నారు.
సింగిల్స్ విషయాన్ని అటుంచితే.., డబుల్స్ విభాగంలో మాత్రం రాణించే దిశగా కృషి చేస్తానని వీనస్ చెబుతోంది. వింబుల్డన్ టైటిళ్‌ను వీనస్ విలియమ్స్ చేజార్చుకోవడంతో ఈ ఏడాది వింబుల్డన్ విజేతగా సెరీనా విలియమ్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెరీనాతో పాటు తన ఆటతీరును ఇంకా మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నిస్తానని వీనస్ అంటోంది.
అంతేకాదు.. ఇంకా కొన్ని సంవత్సరాలు టెన్నిస్ కోర్టులో కొనసాగాలన్నదే తమ లక్ష్యమని వీనస్ చెప్పింది. ఈ సీజన్లో జరిగే ప్రతి టోర్నమెంట్లో బాగా రాణించే దిశగా మెరుగ్గా ఆడుతామని ఆమె తెలిపింది. అలాగే మెరుగైన ఆటతీరు, ర్యాంకింగ్‌లలో టాప్‌లో నిలిచేందుకు కృషి చేస్తామని ఆమె వెల్లడించింది. తప్పకుండా ఇద్దరిలో మంచి ఎనర్జీ ఉందని విలియమ్స్ అంది.
సెరీనా విలియమ్స్ మాట్లాడుతూ.. గత ఏడాది జరిగిన మ్యాచ్‌లలో ధీటుగా ఆడానని, అందుకే తనకు వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు దక్కాయని చెప్పింది. వయస్సు పెరిగినా టెన్నిస్ కోర్టులో ఇంకా ఆడాలని ఉందని, ఇంకా ఎక్కువ టోర్నీల్లో పాలుపంచుకోవాలని భావిస్తున్నట్లు సెరీనా తెలిపింది. ఇంకా తన టెన్నిస్ కెరీర్‌లో డబుల్స్ మ్యాచ్‌లు ఆడాలని అనుకుంటున్నట్లు సెరీనా చెప్పుకొచ్చింది.