ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » త్వరలో షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నీ (Shaheed Bhagat Singh international wrestling tourny | Jalandhar)
త్వరలో షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నీ
జలంధర్‌లోని ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 30వ తేదీ నుంచి షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా, ఇరాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, కెనడా, జర్మనీ, జపాన్, కొరియా, నైజీరియా, పాకిస్థాన్ తదితర దేశాలతో పాటు ఆతిథ్య దేశమైన భారత్ కూడా ఈ రెజ్లింగ్ పోటీలో పాల్గొంటోంది.
ఈ టోర్నీకి నిర్వాహక కమిటీ కార్యదర్శిగా.. మాజీ భారత రెజ్రల్ కర్తార్ సింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో విజేతలుగా నిలిచిన వారికి రూ. 30లక్షల మేరకు బహుమతిగా అందజేయనున్నారు. ఈ పోటీలు జాతీయ ఛానెల్ దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.