దేశవ్యాప్తంగా వివిధ క్రీడల్లోని జట్లకు సమర్పకులుగా, టోర్నీ నిర్వహాకులుగా వివిధ అవతారాలు దాల్చిన సహారా ఇండియా పరివార్.. త్వరలో బహుళ రూపం దాల్చనుంది. అత్యుత్తమ ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించే క్రీడాకారులకు అవార్డులతో సత్కరించాలని సహారా నిర్ణయించింది.
'సహారా ఇండియన్ స్పోర్ట్స్ అవార్డ్స్' పేరిట ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువకుల్లోని ప్రతిభ నైపుణ్యాలను గుర్తిస్తూ.. వివిధ క్రీడ రంగాల్లోని క్రీడాకారులకు ఈ అవార్డులను అందజేయాలని సహారా భావిస్తోంది. నవంబర్ 9వ తేదీన జరిగే గాలా అవార్డుల కార్యక్రమంలో క్రీడ కోచ్‌లు, అధికారులు, పరిపాలకులు సహారా ఇండియా పరివార్ అవార్డులకు గుర్తింపు తేనున్నారు.
ఈ ఏడాది ఆరంభంలో.. భారత బాక్సింగ్, రెజ్లింగ్, ఆర్చరీ తాజాగా.. భారత షూటింగ్ వంటి క్రీడలను సహారా ఇండియా దత్తత తీసుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత వరకు ఈ నాలుగు క్రీడల్లోని 56 మంది క్రీడాకారులకు సహారా మద్దతుగా నిలుస్తుంది. సహారా ఇండియన్ స్పోర్ట్స్ అవార్డులను ప్రారంభోత్సవ కార్యక్రమానికి సహారా కంపెనీ మేనేజింగ్ వర్కర్ మరియు ఛైర్మన్ సుబ్రతో రాయ్, క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌లు విచ్చేశారు.