వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » నేటి నుంచి మహిళా క్రీడల పోటీలు (Women sports meet | Himachal youth services)
Feedback Print Bookmark and Share
 
అక్టోబర్ 28వ తేదీ నుంచి నహన్‌ (హిమాచల్ ప్రదేశ్)లో 26వ మహిళా క్రీడల టోర్నీ ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ మహిళా క్రీడా టోర్నీ.. హిమాచల్ యూత్ సర్వీసెస్ మరియు క్రీడా విభాగాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి.

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్, ధుమాల్ సిర్‌మూర్ డిప్యూటీ కమిషనర్ పదమ్ సింగ్ చౌహాన్‌లు ఈ క్రీడలను ప్రారంభిస్తారు. ఈ టోర్నీలో రాష్ట్రంలోని 12 జిల్లాలకు చెందిన సుమారు 500 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. వంద మంది ఉపాధ్యాయులు, కోచ్‌ల నేతృత్వంలో ఈ క్రీడాకారులు ఉంటారు.

ఫుట్‌బాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్, ఖోఖో, అథ్లెటిక్స్ తదితర పోటీలను నిర్వహిస్తారు. ఈ పోటీలు నిర్వహించి తద్వారా ఇందులో అత్యుత్తమ నైపుణ్యం కనబరిచిన వారిని జాతీయ క్రీడల్లో పాల్గొనే జట్లలోకి తీసుకుంటారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.