వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఫ్రెంచ్ బ్యాడ్మింటన్ సిరీస్ మెయిన్ డ్రాలో శ్రీధర్ (Anup Sridhar | French Badminton Series | Main draw | qualify round)
Feedback Print Bookmark and Share
 
భారత షట్లర్ అనూప్ శ్రీధర్ పారిస్‌లో జరుగుతున్న యోనెక్స్ ఫ్రెంచ్ సూపర్ బ్యాడ్మింటన్ సిరీస్‌ మెయిన్ డ్రాకు చేరుకున్నాడు. ఈ టోర్నీ క్వాలిఫై రౌండులో జరిగిన మ్యాచ్‌లో వరుస విజయాలతో అలవొకగా మెయిన్ డ్రాలోకి శ్రీధర్ అడుగుపెట్టాడు. క్వాలిఫైయింగ్ రౌండులో తన సహచర ఆటగాళ్ల కంటే శ్రీధర్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు.

తొలి మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన థామస్ కొప్రివా.. 1-1 ఉన్న సమయంలో అనారోగ్య కారణంగా ఆట నుంచి వైదొలిగాడు. దీంతో శ్రీధర్ విజేతగా నిలిచాడు. ఇక రెండో మ్యాచ్‌లో స్వీడన్‌కు చెందిన హెన్రి హర్కానెన్‌తో 27 నిమిషాలు పోరాడి చివరకు.. 21-19, 51-11తో శ్రీధర్ నెగ్గాడు. మెయిన్‌ డ్రాలో శ్రీధర్ తొలుత.. చైనా టాప్ సీడ్ ఆటగాడు లిన్ డాన్‌తో తలపడనున్నాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.