ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఆసియా గేమ్స్: జాతీయ పతాక ధారిణిగా మేరీ (Mary Kom | Indoor Asian Games | National Flag bearer | Baishya)
హనోయ్‌లో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు జరిగే మూడవ ఇండోర్ ఆసియా క్రీడల్లో భారత పతాక ధారిణిగా నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్, ఖేల్ రత్నా అవార్డీ అయిన మహిళా బాక్సర్ మేరీ కామ్ వెళ్లనుంది. ఈ విషయాన్ని భారత ఛెప్ డీ మిషన్ బీపీ బైష్యా వెల్లడించారు.
విలేకరులతో బైష్యా మాట్లాడుతూ, భారత్ తరపున సుమారు 279 మంది సభ్యులు గల జట్టు ఈ క్రీడలకు వెళ్లనుందన్నారు. ఇందులో 179 మంది అథ్లెట్లు ఉన్నారన్నారు. ప్రపంచ ఛాంపియన్స్ క్యూయెస్ట్ పంకజ్ అద్వానీ సహా పలువురు ఆటగాళ్లు ఈ భారత జట్టుతో కలిసి వెళుతున్నారని తెలిపారు.
ఈ టోర్నీలో మొత్తం 19 వేర్వేరు క్రీడల్లో ఈ భారత జట్టు పాల్గొంటుంది. ఇందులో క్యూ స్పోర్ట్స్, చెస్, అథ్లెటిక్స్, మహిళల బాక్సింగ్, ఆర్చరీ, బాస్కెట్‌బాల్ ఉన్నాయి.