ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » హాకీ ప్రాక్టీస్ మ్యాచ్: జపాన్‌పై భారత్ గెలుపు (Hockey | Practice Match | India | Japan | Bankok | Thailand | Asia cup Hockey tourny)
హాకీ ప్రాక్టీసు మ్యాచ్‌లో బలమైన జట్టు జపాన్‌పై భారత జట్టు గెలుపొందింది. ఏడో మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ ఆడేందుకు బ్యాంకాక్ వెళ్లిన సందర్భంగా భారత జట్టు.. జపాన్‌తో ప్రాక్టీసు మ్యాచ్‌లో పాల్గొంది. ఇందులో జపాన్‌పై 1-0తో భారత్ గెలుపొందింది.
ఈ టోర్నీలో చైనా, మలేషియా, సింగపూర్, ఆతిథ్య దేశం థాయ్‌లాండ్ వంటి ప్రత్యర్థుల మధ్య గ్రూప్ ఏలో భారత్ ఉంది. ఈ టోర్నీలో భాగంగా.. తొలి మ్యాచ్‌లో భారత్ సింగపూర్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ క్వీన్ సిక్రిట్ యూనివర్శిటీ స్పోర్ట్స్ కేంద్రం వద్ద నేడు జరుగనుంది.
బ్యాంకాక్‌లో భారత హాకీ కోచ్ ఎంకే కౌషిక్ మాట్లాడుతూ, ప్రారంభ మ్యాచ్‌లో తాము భారీ తేడాతో గెలుపొందడంపై దృష్టి సారించామన్నారు. గ్రూప్ ఏలో తమకు చైనా నుంచే తమకు తీవ్ర ప్రతిఘటన ఎదురుకానుందన్నాడు. ఒక మంచి గోల్‌తో సెమీస్‌లో తాము అడుగుపెడతామన్నాడు.
అదలా ఉంచితే.. 2004లో భారత్‌కు పసిడి పతకాన్ని సాధించడంలో కౌషిక్ జట్టుకు దిశానిర్ధేశం చేశాడు. కాగా, ఈ టోర్నీ ఫైనలిస్ట్‌లుగా నిలిచిన జట్లు 2010 ప్రపంచ కప్‌కు క్వాలిఫై అవుతారు.