వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » డ్రగ్స్ వాడింది నిజమే: ఆత్మకథలో అగస్సీ (Andre Agassi | drugs | doping test | autobiography | Eight times grand titles)
Feedback Print Bookmark and Share
 
అనుకోని ఒత్తిడిలో తాను డ్రగ్స్ తీసుకున్నానని.. అయితే నిషేధం నుంచి తప్పించుకునేందుకు పురుషుల టెన్నిస్ నియంత్రణ సంస్థ ఏటీపీకి అబద్ధం చెప్పానని ఎనిమిదిసార్ల గ్రాండ్ స్లామ్ టైటిల్ విజేత ఆండ్రీ అగస్సీ తన ఆత్మకథలో తెలిపాడు. అగస్సీ ఆత్మకథ నిన్న బుధవారం విడుదలై.. టెన్నిస్ విఫణిలో ప్రకంపనలు సృష్టించింది.

అగస్సీ తన ఆత్మకథలో ఈ విధంగా వివరించాడు. 1997లో డోపింగ్ టెస్ట్‌లో తాను విఫలమైనట్లు అగస్సీ తెలిపాడు. తాను కుటుంబ మరియు ఇతరత్రా ఒత్తిళ్ల మధ్య నలుగుతున్నానన్నాడు. అమెరికా నటి బ్రూక్ షీల్డ్స్‌తో ప్రేమ వ్యవహారం.. అప్పటి తన ఫామ్‌పై
ఆందోళన కలిగించాయన్నాడు.

ఈ కారణాలు తనను డ్రగ్స్ తీసుకునేందుకు ప్రేరేపించాయన్నాడు. అయితే తెలియక తప్పు చేసినట్లు ఏటీపీ అధికారులతో అబద్ధమాడినట్లు వివరించాడు. తన అసిస్టెంట్ కొంత పరిమాణంలో పౌడర్ తెచ్చిచ్చాడని.. దానిని తాను పీల్చినట్లు తెలిపాడు. దాన్ని తీసుకోగానే.. ఎక్కడలేని ఉత్సాహం, శక్తి వచ్చాయన్నాడు.

దీంతో తాను ఇళ్లంతా శుభ్రపరచడమే కాకుండా.. బాత్‌రూమ్ కూడా క్లీన్ చేసినట్లు పేర్కొన్నాడు. డ్రగ్ తీసుకున్న కొంత కాలానికి డోప్ టెస్ట్‌లో విఫలమైనట్లు ఏటీపీ వైద్యుడు తనకు సమాచారం అందించాడన్నారు. అది విన్న తాను పూర్తిగా నిరుత్సాహపడ్డానని.. కష్టపడి సాధించిన తన పేరు ప్రఖ్యాతులకు భంగం వాటిల్లే అవకాశాలన్నాయనే భయంతో సన్నబడేందుకు తాను ఈ డ్రగ్ వాడినట్లుగా అబద్ధం చెప్పినట్లు వివరించాడు.

కాగా, అంతర్జాతీయ టెన్నిస్‌లోకి అగస్సీ 1980లలో అడుగుపెట్టాడు. పొడవాటి జుట్టు, వెరైటీ వస్త్ర ధారణతో.. వచ్చాడు. దీంతో సరికొత్త తరం టెన్నిస్ అభిమానులను తన సొంత చేసుకున్నాడు. 1992లో వింబుల్డన్, 1994లో యూఎస్ ఓపెన్, 1995లో ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిళ్లు సాధించాడు.

ప్రస్తుతం అగస్సీ.. మాజీ మహిళా టెన్నిస్ నెంబర్ వన్ స్టెఫీ గ్రాఫ్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. 1999లో యూఎస్ ఓపెన్ గెలుచుకుని.. ఆ యేడాదిలో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. 2006లో కన్నీటితో వీడ్కోలు పలికే ముందు మూడు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లను నెగ్గాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.