ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ రెండో రౌండులో సైనా (Saina Nehwal | Jwala Gutta | Dviju | Aswini Ponnappa | French Super Badminton Series)
పారిస్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ సిరీస్‌లో భారత మహిళా ప్రధాన షట్లర్ సైనా నెహ్వాల్ రెండో రౌండుకు చేరుకుంది. ఈ టోర్నీ తొలి రౌండులో జరిగిన మ్యాచ్‌లో జర్మనీకి చెందిన జులియాన్ స్కెన్క్‌పై సైనా సంచలన విజయం నమోదు చేసి రెండో రౌండు బెర్త్ ఖరారు చేసుకుంది.
తొలి రౌండు మ్యాచ్‌లో జులియాన్‌పై 53 నిమిషాలు పోరాడి 21-18, 19-21, 21-13తో ఎనిమిదో సీడ్ సైనా గెలుపొందింది. ఇక ఇదే టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్, మహిళల డబుల్స్ విభాగంలో జ్వాలా గుత్తా విజయాలు నమోదు చేసింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో వీ ద్విజుతో జతకట్టగా.. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో బరిలోకి దిగింది.
మహిళల డబుల్స్‌లో డేన్ జోడీ లైన్ డామ్‌కజార్ క్రూస్, మీ స్కజాట్ కిర్‌స్టెన్‌సేన్‌లపై 21-17, 21-18తో జ్వాలా, అశ్వినీ జోడీ గెలుపొందింది. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫ్రెంచ్ జోడీ బాప్తిస్తే కారెమే, లారా కొయ్‌నెట్‌లపై 28 నిమిషాలు పోరాడి 21--19, 21-15తో జ్వాలా, ద్విజుల జోడీ గెలుపొందింది.