ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » అండర్- 18 ఆసియా కప్‌కు వెళ్లనున్న భారత జట్టు (Hockey | Asia Cup | Under 18 | Indian team | Mayanmar | Manpreet Singh)
మయన్మార్‌లోని యాంగోన్‌లో జరిగే అండర్- 18 బాలుర ఆసియా కప్ హాకీ టోర్నీకి 18 మంది సభ్యులు గల బృందం భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. నవంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు జరిగే ఈ పోటీలకు వెళ్లే భారత జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) ఎంపిక చేసింది.
మిడ్ ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఈ జట్టులో ఇద్దరు గోల్‌కీపర్లు, ముగ్గురు ఫుల్ బాక్స్, ఆరుగురు మిడ్‌ఫీల్డర్లరు, ఏడుగురు ఫార్వార్డ్‌లు ఉన్నారు. 2001 నుంచి అంటే... సుమారు ఎనిమిదేళ్లుగా డిఫెండింగ్ ఛాంపియన్‌లుగా ఈ టోర్నీలో భారత్ రాణిస్తోంది.
ఈ టోర్నీ ఎడిషన్‌లో విజేతగా నిలిచి జట్టు.. వచ్చే ఏడాది సింగపూర్‌లో జరిగే యూత్ ఒలింపిక్స్ క్రీడలకు క్వాలిఫై అవుతుంది. కాగా, ఈ టోర్నీ గ్రూప్ ఏలో భారత జట్టు ఉంది. ఈ గ్రూపులో పాకిస్థాన్, మలేషియా, శ్రీలంక, చైనీస్ తైపీ తదితర జట్లు ఉన్నాయి. నవంబర్ 13న జరిగే ప్రారంభ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఆ తర్వాత నవంబర్ 14న మలేషియా, నవంబర్ 16న పాక్, నవంబర్ 17న చైనీస్ తైపీలతో భారత్ తలపడనుంది.