వచ్చే ఏడాదిలో జరిగే ఐఏఏఎఫ్ డైమండ్ లీగ్‌లో వివిధ రకాల ఏడు కేటగిరీల్లో వంద మీటర్ల పరుగుపందెంలో ప్రపంచ రికార్డ్ ఉన్న ఉసేన్ బోల్ట్ పాల్గొంటున్నాడు. నవంబర్ తొలి వారంలో కెన్యా నుంచి తిరిగి జమైకాకు చేరుకోనున్న బోల్ట్ 2010 సీజన్ కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటాడు.
కింగ్‌స్టన్‌లో జమైకా కోచ్ గ్లెన్ మిల్స్ విలేకరులతో మాట్లాడుతూ, వచ్చే ఏడాదిలో జరిగే డైమండ్ లీగ్ తమకు అత్యంత కీలక ప్రాజెక్టని తెలిపారు. 100మీ నుంచి 200మీల మధ్య ఏడు పరుగు పందాల్లో బోల్ట్ పాల్గొననున్నట్లు వివరించారు. 2010 సీజన్ కోసం సిద్ధమవుతున్న బోల్ట్.. 2011లో జరిగే ప్రపంచ టైటిళ్ల పోటీల్లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్నాడు.
బీజింగ్ ఒలింపిక్ టైటిల్స్ గెలుచుకున్న బోల్ట్ లండన్‌లో జరిగే 2012 ఒలింపిక్స్ టైటిల్‌ను కూడా నెగ్గాలని చూస్తున్నాడు. 2010లో తన ప్రదర్శనను బట్టి బోల్ట్ భవిష్యత్‌కు సంబంధించి ప్రణాళిక ఉంటుందని మిల్స్ వ్యాఖ్యానించాడు.