వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » సియోల్ ఛాలెంజర్: దుసాన్ చేతిలో సోమ్‌దేవ్ ఓటమి (Seoul Challenger | Somdev Devvarman | Tennis | Dusan Lojda)
Feedback Print Bookmark and Share
 
సియోల్‌లో జరుగుతున్న ఏటీపీ ఛాలెంజర్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో సోమ్‌దేవ్ దేవవర్మన్ ఓటమి చవిచూశాడు. ఈటోర్నీ క్వార్టర్‌ఫైనల్లో జరిగిన మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన దుసాన్ లోడ్జా చేతిలో స్ట్రెయిట్ సెట్లలో సోమ్‌దేవ్ ఓటమి చవిచూసి లాస్ట్ ఎయిట్ చేరుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

సుమారు 125,000 డాలర్ల ఈ హార్డ్ కోర్ట్ టోర్నీలో ఒక అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన దుసాన్ చేతిలో 4-6, 2-6తో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన సోమ్‌దేవ్ అనూహ్యం పరాజయాన్ని చవిచూశాడు. సోమ్‌దేవ్ ఓటమితో.. ఈ టోర్నీలో భారత సవాలు ముగిసింది.

ఈ టోర్నీలో క్వార్టర్స్ వరకు సోమ్‌దేవ్ కనబరిచిన ప్రదర్శనకు గాను.. 20 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. అంతకుముందు.. ఇదే టోర్నీలో మరో భారత ఆటగాడు ప్రకాశ్ అమృతరాజ్.. సింగిల్స్, డబుల్స్ విభాగంలో తొలి రౌండు నుంచే వైదొలిగిన విషయం తెలిసిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.