వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » దోహా ఓపెన్: వోజ్‌నియాకీపై జంకోవిక్ గెలుపు (Jelena Jankovic | Doha WTA Championships | Tennis | Caroline Wozniacki | Semifinal)
Feedback Print Bookmark and Share
 
దోహాలో జరుగుతున్న డబ్ల్యూటీఏ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో డెన్మార్క్‌కు చెందిన కరోలిన్ వోజ్‌నియాకీపై 6-2, 6-2తో సెర్బియాకు చెందిన జలీనా జంకోవిక్ గెలుపొందింది. ఈ టోర్నీ క్వార్టర్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో విజయంతో జంకోవిక్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.

వోజ్‌నియాకీ, మాజీ ప్రపంచ నెంబర్ వన్ అయిన జంకోవిక్‌ల మధ్య జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ ఏక పక్షంగా సాగింది. తొలి రెండు మ్యాచ్‌లలోను జంకోవిక్ విజయం సాధించేందుకు కేవలం 95 నిమిషాలు మాత్రమే తీసుకుంది. రెండో రౌండు మ్యాచ్‌లో రష్యాకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ దినారా సఫీనాతో జంకోవిక్ తలపడింది.

అయితే సఫీనాకు గాయం అయి.. అర్థాంతరంగా మ్యాచ్ నుంచి వైదొలగడంతో.. జంకోవిక్‌ను విజేతగా ప్రకటించారు. ఇక సెమీస్‌లో జంకోవిక్‌తో తలపడే ప్రత్యర్థి శనివారం నిర్ణయించడం జరుగుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.