ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » చైనా స్క్వాష్ టోర్నీ: క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన సచ్‌దే (Siddharth Suchde | China Squash Open Tourny | quarters | James Snell)
చైనా స్క్వాష్ టోర్నీ: క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన సచ్‌దే
షాంఘైలో జరుగుతున్న చైనా స్క్వాష్ ఓపెన్ ఛాంపియన్‌షిప్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ఆటగాడు సిద్ధార్థ సచ్‌దే క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. ఈ టోర్నీ రెండో రౌండులో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు చెందిన ఎనిమిదో సీడ్ ఆటగాడు జేమ్స్ స్నెల్‌పై సచ్‌దే గెలుపొంది క్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు.
ఈ టోర్నీలో సచ్‌దే అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగాడు. జేమ్స్‌పై 3-11, 11-8, 11-6, 6-11, 12-10తో 103వ ర్యాంకు ఆటగాడు సచ్‌దే గెలుపొందాడు. వీరిద్దరి మధ్య మ్యాచ్ సుమారు ఒక గంటకు పైగా జరిగింది. ముంబై నుంచి వచ్చిన ఈ 24 ఏళ్ల సచ్‌దే క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ కర్వాల్‌స్కీతో తలపడనున్నాడు.