వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » డిసెంబర్ 27 నుంచి క్యారమ్స్ ఫెడరేషన్ కప్ (Carroms Federation cup | December 27 | Ashok Singh | Lok Pati Tripathi)
Feedback Print Bookmark and Share
 
వారణాసిలో డిసెంబర్ 27 నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు జాతీయ మరియు అంతర్జాతీయ 37వ సబ్ జూనియర్ మరియు 17వ ఆల్ ఇండియా ఫెడరేషన్ కప్ క్యారమ్స్ ఛాంపియన్‌షిప్ టోర్నీలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని ఈ టోర్నీ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు అశోక్ సింగ్ వెల్లడించారు.

వారణాసిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లోక్ పతి త్రిపాటీ సంస్మరణార్థం ఈ ఛాంపియన్‌షిప్స్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఛాంపి‌యన్‌షిప్‌లలో సుమారు 800 మంది ఆటగాళ్లు మరియు వంద మందికి పైగా అధికారులు పాల్గొననున్నట్లు వివరించారు.

జీవన్ దీప్ గ్రూపు ప్రాంగణంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఛాంపియన్‌షిప్‌లలో దేశవ్యాప్తంగా అనేక మంది కొత్త ఆటగాళ్లు పోటీ చేయనున్నట్లు తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.