వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్: సైనా, జ్వాలా-ద్విజులు ఔట్ (Saina Nehwal | Jwala Gutta | Dviju | French Open Badminton Series | Wang Lin)
Feedback Print Bookmark and Share
 
పారిస్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌ మహిళల సింగిల్స్ విభాగంలో భారత టాప్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓటమి చవిచూసింది. ఈ టోర్నీ క్వార్టర్స్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సైనా.. చైనా టాప్ సీడ్ క్రీడాకారిణి వాంగ్ లిన్ చేతిలో అనూహ్య పరాజయాన్ని చవిచూసింది.

ఈ టోర్నీలో ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగిన సైనా.. వాంగ్ లిన్‌తో సుమారు 49 నిమిషాలకు పైగా పోరాడింది. చివరకు.. వాంగ్ చేతిలో 21-15, 11-21, 15-21తో సైనా కంగుతింది. నిర్ణయాత్మక ఆఖరి సెట్లో సైనా సరైన సమయంలో పుంజుకోలేకపోయింది. దీంతో ప్రత్యర్థికి సెమీస్ బెర్త్ అప్పగించింది.

మరోవైపు ఈ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో.. భారత్‌కు చెందిన ఆరోసీడ్ జోడీ జ్వాలా గుత్తా, వీ ద్విజులు ఓటమి పాలమయ్యారు. ఈ టోర్నీ క్వార్టర్స్‌లో ఇండోనేషియా జోడీ అయిన నోవా విడియాంటో, లిలియానా నాట్సిర్‌ల చేతిలో 21-6, 20-22, 10-21తో జ్వాలా, ద్విజు జోడీ పరాజయాన్ని చవిచూసింది. ఈ జోడీల మధ్య మ్యాచ్ 42 నిమిషాల పాటు సాగింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.