వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నీ: భారత్‌కు మూడు స్వర్ణాలు (Shaheed Bhagat Singh International Wrestling Tournament | Jalandhar | India | three golds)
Feedback Print Bookmark and Share
 
జలంధర్‌లో జరుగుతున్న షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నీలో ప్రారంభ రోజున భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు దక్కాయి. 60 కేజీల కేటగీరీలో రజనీష్, 96 కేజీల కేటగిరీలో మౌసమ్ ఖత్రీలు పురుషుల విభాగంలో పసిడి పతకాలను నెగ్గారు. ఇక మహిళల విభాగంలో 55 కేజీల కేటగిరీలో గీతా కూడా పోల్ పొజిషన్‌లో నిలిచింది.

ప్రారంభ రోజున భారత్‌కు మొత్తం 12 పతకాలు దక్కాయి. వీటిలో మూడు పసిడి, ఐదు రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. మహిళల విభాగంలో పతకాల పట్టికలో జపాన్ ఆధిక్యంలో ఉంది. వివిధ కేటగిరీల్లో జపాన్‌కు మొత్తం నాలుగు స్వర్ణ పతకాలు వచ్చాయి.

60 కేజీల కేటగిరీ పురుషుల విభాగంలో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. రాహుల్ మన్, హర్దీప్ సింగ్.. రెండు, మూడు స్థానాలు దక్కించుకోగా.. రజనీష్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇక మహిళల విభాగంలో వరల్డ్ ఛాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనలిస్ట్ అయిన గీతా ఒక్కటే.. పసిడి పతకం నెగ్గింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.