వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » అగస్సీ డోపింగ్ కేసు.. చిన్నదేమీ కాదు: వాడా (Crystal Meth | Andre Agassi | WADA | World Anti Doping Agency)
Feedback Print Bookmark and Share
 
ఎనిమిది గ్రాండ్ స్లామ్ టైటిల్ విజేత ఆండ్రీ అగస్సీ డోపింగ్ వివాదం అంత చిన్నదేమీ కాదని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) వెల్లడించింది. దీనికి సంబంధించి దర్యాప్తు చేసి అగస్సీపై తగిన చర్యలు చేపట్టేందుకు వాడా రంగం సిద్ధం చేస్తోంది. 1997లో తాను డ్రగ్స్ తీసుకున్నానని.. డోపింగ్ పరీక్షలో సైతం తాను విఫలమైనట్లు అగస్సీ అంగీకరించిన నేపథ్యంలో వాడా ఈ వ్యాఖ్యాలు చేసింది.

బ్రిటన్‌లోని టైమ్స్ న్యూస్ పేపర్‌లో గత వారం 'ఓపెన్' అనే తన ఆత్మకథలో డ్రగ్స్‌పై అగస్సీ బహిర్గతం చేశాడు. అగస్సీ ఆత్మకథ.. యావత్ టెన్నిస్ ప్రపంచాన్ని నిర్ఘాంతపోయేలా చేసింది. దీంతో టెన్నిస్ విఫణిలో ఎనలేని పేరు ప్రఖ్యాతలున్న అగస్సీపై నీలి నిడలు కమ్ముకోనున్నాయి.

1997లో డ్రగ్స్ తీసుకున్న అనంతరం నిషేధం నుంచి తప్పుకునేందుకు ఏటీపీ ముందు అగస్సీ అబద్ధమాడినట్లు అంగీకరించాడు. దీనిపై వాడా డైరెక్టర్ జనరల్ డేవిడ్ హోమన్ విలేకరులతో మాట్లాడుతూ, ఒత్తిడిలో ఉండి అగస్సీ అబద్ధం చెప్పాడా.. లేదా అన్న దానిపై తాము దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

ఈ దర్యాప్తులో వచ్చే నివేదికను అనుసరించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. అయితే ఏటీపీ అబద్ధం చెప్పడమనేది చిన్న విషయమేమీ కాదన్నారు.. దీనికి కొంత మేరకు అయినా శిక్ష తప్పదన్నారు
సంబంధిత సమాచారం కోసం శోధించండి.